తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి వివాహ వేడుక కన్నులపండువగా జరిగింది. మేళతాళాల నడుమ.. ఆలయ అర్చకులు స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలు చదువుతూ కన్యాదానం చేశారు. కల్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు.
ఘనంగా వాడపల్లి వెంకటేశ్వరస్వామి కల్యాణం - famous temples in east godavari
తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. లాక్ డౌన్ అమలులో ఉన్నందున భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించకుండా దేవాదాయ శాఖ అధికారులు.. ఆలయ అర్చకులు, వేద పండితుల నడుమ స్వామి అమ్మవార్ల వివాహ వేడుకను ఘనంగా జరిపించారు.
ఘనంగా వాడపల్లి వెంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతం వేదపండితులు తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. ఏటా భక్తుల కోలాహలంతో ఎంతో వైభవంగా నిర్వహించే ఈ వేడుకను కొద్ది మంది భక్తులు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధుల నడుమ నిర్వహించారు.
ఇదీ చదవండి.