తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంకలో దారుణం చోటు చేసుకుంది. 77 ఏళ్ల వృద్ధురాలిని మనవడే నరికి చంపడం కలకలం రేపింది. పెండ్యాల అరవాలమ్మకు పెంకుటిల్లు, రెండెకరాల పొలం ఉంది. ఈ ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య వివాదం నెలకొంది. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ క్రమంలో వృద్ధురాలితో ఘర్షణ పడ్డారు. మనవడు పెండ్యాల రవి కోపంతో వృద్ధురాలిని గొడ్డలితో నరికేశాడు. రక్తపు మడుగులో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి కోసం నానమ్మను గొడ్డలితో నరికి చంపిన మనవడు - crime news in east godavari
ఆస్తికోసం సొంత నాయనమ్మనే నరికి చంపేశాడు మనవడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంకలో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Breaking News