తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ జాతర మహోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఉత్సవాల్లో భాగంగా.. గరగల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. పూజారులు గరగలు పట్టుకుని గ్రామంలో తిరగగా.. భక్తులు గరగలపై అరటిపండ్లు విసిరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
ఘనంగా కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి జాతర - east godavari district latest news
తూర్పుగోదావరి జిల్లాలో కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.
ఘనంగా కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి జాతర