తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు తెల్లవారు జామున పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం జపాలు, పారాయణలు, మహా లింగార్చన, ఆయుష్య హోమం, పూర్ణాహుతి, రథోత్సవ సేవ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు శోభాయమానంగా మారాయి.
ఘనంగా అన్నవరం సత్యనారాయణస్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుక - annavaram sathyanarayana swamy
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. స్వామివారికి వివిధ పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మలికిపురానికి చెందిన ఓ వైద్యుడు... స్వామివారికి బంగారు వింజామర, యజ్ఞోపవీతాన్ని విరాళంగా అందించారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి
అన్నవరం సత్యనారాయణ స్వామికి ఓ దాత రూ. 11 లక్షల విలువైన బంగారు వింజామర, యజ్ఞోపవీతంను విరాళంగా అందించారు. మలికిపురానికి చెందిన డాక్టర్ ఎస్.వి. రాంబాబు సుమారు 200 గ్రాముల బంగారంతో వీటిని తయారు చేయించి దేవాలయ అధికారులకు సమర్పించారు.
ఇదీచదవండి.