ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గెట్ టు గెదర్ @ 5తరాలు.. 300 కుటుంబాలు

ఒకప్పుడు ఊరిలో వారంతా ఒక కుటుంబంలా ఉండేవారు.. బయటవారు ఎవరైనా వచ్చి వివరాలు అడిగితే దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లేవారు. ఇప్పుడా రోజులు లేవు. ఒకే కుటుంబంలో ఉన్నవారే ఊరికొకరు చొప్పున వెళ్లిపోయి.. ఎక్కడెక్కడో జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఐదారు తరాలు.. 300లకు పైగా కుటుంబాలు.. ఒకే చోట చేరితే.. తాత 50వ పెళ్లి రోజుకు మునిమనవళ్లు వచ్చి స్టెప్పులేస్తే.. ఇదిగో ఇలా గ్రంధివారి వంశ వృక్షంలా ఉంటుంది.

grandhi family get to gather
ఒకే చోట 5తరాలు.. 300 కుటుంబాలు

By

Published : Mar 14, 2021, 10:43 AM IST

ఒకే చోట 5తరాలు.. 300 కుటుంబాలు

తాతలు.. అమ్మమ్మలు.. పెద్దమ్మలు.. పెదనాన్నలు.. అక్కలు.. తమ్ముళ్లు.. బావలు.. మరదళ్లు.. ఆహా ఇలా చెప్పుకుంటూనే ఇంత బాగుంటే.. వారంత ఒక దగ్గర చేరి సందడి చేస్తే ఎలా ఉంటుంది. ఇంకేముంది సందడే సందడి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో నెలకొన్న సందడిని చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఐదారు తరాలు.. 300లకు పైగా కుటుంబాలు.. గ్రంథివారి వంశ వృక్షం పేరిట.. గ్రంధి నానబ్బులు 50వ పెళ్ళి రోజు జరుపుకుంటున్న సందర్భంగా వీరంతా ఒక దగ్గర కలిసి కనువిందు చేశారు.

తరాల అంతరాన్ని మరిచి ఆడిపాడారు..
గ్రంథి తమ్మయ్య మూలపురుషుడిగా చేసుకొని సుమారు ఐదు తరాలు వారు.. రాజానగరం మండలం దివాన్ చెరువు రాజా రాజేశ్వరి కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు. చిన్న, పెద్ద ముసలి, ముతకా, యువత అంతా కలిసి.. అరమరికలు లేకుండా.. తరాల అంతరాన్ని మరిచి ఆడిపాడారు.

ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటూ.. వారి మధ్య ఉన్న బంధాలను మరోసారి గుర్తు చేసుకుంటూ.. అనుబంధాలను పెనవేసుకుంటూ పోయారు. ఇలా అందరం ఒక చోట కలవటం ఆనందంగా ఉందని.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...:వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details