ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PAWAN TOUR: రాజమహేంద్రవరంలో పవన్​ పర్యటన.. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

By

Published : Oct 2, 2021, 12:28 PM IST

Updated : Oct 2, 2021, 1:35 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. పవన్‌కు జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా.. రెండు జిల్లాల్లో పవన్ శ్రమదానం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పవన్​ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

pawan kalyan at rajamahendravaram airport
రాజమహేంద్రవరంలో పవన్‌కు ఘనస్వాగతం

రాజమహేంద్రవరంలో పవన్‌కు ఘనస్వాగతం
జనసేన శ్రేణులను అడ్డుకున్న పోలీసులు

రాజమహేంద్రవరంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్​కల్యాణ్​ పర్యటన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. పవన్​ పర్యటనకు, జనసేన సభకు ఆంక్షలు లేవన్న పోలీసులు.. శ్రమదానానికి మాత్రం అనుమతి లేదని తెలిపారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పవన్‌కల్యాణ్‌తో రెండు వాహనాలనే పోలీసులు అనుమతించారు. మిగతా వాహనాలను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. దీంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.. పవన్‌ వెంట వెళ్లేందుకు అనుమతించలేదని పోలీసులతో జనసేన శ్రేణుల వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్‌ వెంట వస్తున్న వాహనాలను అడ్డుకోవడంపై క్వారీ సెంటర్‌లో పోలీసుల తీరుపై పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ శ్రమదానం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో పవన్‌కు జనసేన శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా జనసేన ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రహదారిపై పవన్‌ శ్రమదానం చేయాలని నిర్ణయించారు. కాగా, భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. అధికారుల సూచనతో హుకుంపేట రోడ్డుకు కార్యక్రమాన్ని మార్చారు.

మరోవైపు పవన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు రాజమహేంద్రవరానికి వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పవన్‌ అభిమానులను ఎక్కడికక్కడ ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. పవన్‌ సభ నిర్వహించనున్న బాలాజీపేటకు ఇరువైపుల 5 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా, బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవని తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ లలితకుమారి తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ సభకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పారు.

రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పవన్‌ బాలాజీపేటకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, ప్రజలకు అభివాదం చేశారు. దారి పొడవునా జనసైనికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు.

రాజమహేంద్రవరంలో పర్యటన అనంతరం పవన్​కల్యాణ్​.. అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.

ఇదీ చదవండి:

రాజమహేంద్రవరంలో పవన్ పర్యటన.. కాసేపట్లో రహదారులకు శ్రమదానం

Last Updated : Oct 2, 2021, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details