తూర్పుగోదావరి జిల్లా మండపేటలో స్థానిక రైసుమిల్లు అసోసియేషన్ కార్యాలయంలో వాలంటర్ల సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఎంపీ చింతా అనురాధ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గ్రామ వాలంటర్లంతా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. ప్రజలకు నమ్మకం కలిగేలా వ్వవహరించాలని, ఎటువంటి చెడ్డపేరు తేకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గంలోని మూడు మండలాల వాలంటీర్లు, వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
"ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలి" - GRAMA VOLUNTEERS MEETING AT MANDAPETA
ప్రజలకు నమ్మకం కలిగేలా పనిచేయాలని గ్రామ వాలంటీర్లకు... ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు. మండపేటలో జరిగిన వాలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మండపేటలో వాలంటీర్ల సమావేశం
TAGGED:
EAST GODAVARI