కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన తోతల శివనాగకృష్ణ అనే గ్రామవాలంటీర్ ఆదివారం అదృశ్యమయ్యాడు. ఈ నెల 18న రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు తండ్రి త్రిమూర్తులు తెలిపారు. అనంతరం ఫోన్ చేసి ధవళేశ్వరం వద్ద ఉన్నాని చెప్పాడని... ఎంత సేపటికీ తిరిగి రాకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో వెతకగా పిచ్చుకలంక వద్ద అతని చెప్పులు, మాస్కు కనిపించినట్లు గ్రామవాలంటీర్ తండ్రి పేర్కొన్నారు. ఘటనపై ఆత్రేయపురం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై నరేష్ విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.
గ్రామవాలంటీర్ అదృశ్యం... చెప్పులు, మాస్కు లభ్యం - ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ తాజా వార్తలు
కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ఒక గ్రామవాలంటీర్ అదృశ్యమైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గ్రామవాలంటీర్ చెప్పులు, మాస్కు కనిపించినట్లు అతని తండ్రి తెలిపారు.

శివనాగకృష్ణ అనే గ్రామవాలంటీర్ అదృశ్యం