తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడిలో సారా కాస్తూ గ్రామ వాలంటీర్ పట్టుబడ్డాడు. గ్రామానికి చేరువలో కొందరు యువకులు సారా కాస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ సిబ్బంది సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో దాడులు చేశారు. ఈ క్రమంలో 30 లీటర్ల సారాతో పాటు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పనులు చేసేవారని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
నాటుసారా కాస్తూ పట్టుబడ్డ గ్రామ వాలంటీర్ - grama volunteer arrested by east godavari police in liquor case
ఆ యువకుడు ఓ గ్రామ వాలంటీర్. కరోనా ప్రభావంతో లాక్డౌన్ అమలవుతున్న ప్రస్తుత తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన అతనే దారి తప్పాడు. గ్రామంలో నాటుసారా తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఈ ఘటన జరిగింది.
నాటుసారా కాస్తూ పట్టుబడ్డ గ్రామ వాలంటీర్