రాష్ట్రంలో సెప్టెంబరు 5వ తేదీన నూతన ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర గనులు, భూగర్భవనరుల శాఖ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రభుత్వమే ఇసుక సరఫరా చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తోందని గనుల శాఖ తెలిపింది. ఇకపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. వివిధ ప్రాంతాల్లోని రీచ్లు గుర్తించాల్సిందిగా ఏపీఎండీసీకి ప్రభుత్వం సూచించింది.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
కొత్త విధానం అమలయ్యేంత వరకూ రాష్ట్రంలో ఇసుక సరఫరాకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. ఇసుక లభ్యమయ్యే రీచ్లు, పట్టా భూములు, డిసిల్టేషన్ ప్రాంతాలు, స్టాక్ యార్డులను యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలని చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నదులు, వాగులు, కాలువలకు అనుబంధంగా ఉండే రీచ్లు, డిసిల్టేషన్ ప్రాంతాలు, స్టాక్ యార్డుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలకు సంబంధించి గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. రీచ్లకు అనుసంధానంగా ఉండే రహదారి మార్గాల వివరాలు, సరఫరా వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసే అంశంపై వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇసుక రేటును నిర్థారించేందుకు లభ్యతను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా పలుకుతున్న ధరల వివరాలను కూడా తెలియచేయాలన్నారు.
మరో 45 రిచ్లు గుర్తింపు