తూర్పుగోదావరి జిల్లాలో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పర్యటించారు. రాజమహేంద్రవరంలోని గైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ధర్మచైతన్య ఆధ్యాత్మిక సభలో ఆయన పాల్గొన్నారు. పూరీలోని జగద్గురు శంకరాచార్య గోవర్ధన పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మహరాజ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.
రాజమహేంద్రవరం... ఆంధ్రుల ఆధ్యాత్మిక నగరమని... ఆదికవి నన్నయ మహాభారతం రచించిన ప్రదేశమని వివరించారు. జగద్గురు శంకరాచార్యులు బోధనలు ఎప్పటికీ అనుసరనీయమైనవని గవర్నర్ హరిచందన్ అన్నారు. సుశిక్షితం, సురక్షితం, సుసంపన్నమైన జీవనం కోసం ప్రతీఒక్కరూ ఐకమత్యంతో జీవించాలని నిశ్చలానంద స్వామిజీ పిలుపునిచ్చారు.