భారీ వర్షాలకు ఇళ్లు మునిగిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి, పల్లమాంబిక నగర్, బాబానగర్లలో ఆయన పర్యటించారు. వరద బాధితులకు ఒక్కొక్కరికి రూ.500 ఆర్థిక సాయాన్ని అందించారు. మూడు రోజుల్లో 25 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, బంగాళాదుంపలు పంపిణీ చేయటానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వైకాపా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టిందని.. అర్హులందరికీ అందుతాయని తెలిపారు. పేదల పొట్ట నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతిపక్షాలు తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయని..ప్రజలు వాటిని నమ్మవద్దని చెప్పారు.