ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధర్మాడి సత్యం సేవలు ఎంతో అవసరం: దాడిశెట్టి రాజా - ధర్మాడి సత్యం రాష్ట్రానికి హీరో

గోదావరిలో మునిగిన బోటును బయటకు తీయడంతో... ధర్మాడి సత్యం రాష్ట్రానికి హీరోగా నిలిచారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా కొనియాడారు. సత్యంను వైఎస్సార్ జీవిత కాల సాఫల్య పురస్కారానికి ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు.

ధర్మాడి సత్యం సేవలు ఎంతో అవసరం: దాడిశెట్టి రాజా

By

Published : Nov 1, 2019, 8:26 PM IST

ధర్మాడి సత్యం సేవలు ఎంతో అవసరం: దాడిశెట్టి రాజా

ధర్మాడి సత్యం రాష్ట్రానికి హీరోగా నిలిచారని... ఆయన సేవలు ఎంతో అవసరమని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా కొనియాడారు. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన బోటును బయటకు తీయడం పట్ల... వైఎస్సార్ జీవిత కాల సాఫల్య పురస్కారానికి ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఇండియన్ రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్మాడి సత్యంను ఘనంగా సన్మానించారు. నగదు పురస్కారం అందజేశారు. తనను పురస్కారానికి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి జగన్​కు ధర్నాడి కృతజ్ఞతలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details