రాష్ట్రంలో వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రముఖుల విగ్రహాలను ధ్వంసం చేయాలనే మరో కుట్రను తెరమీదకి తీసుకురాబోతున్నారని విమర్శించారు.
'శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తెదేపా కుట్ర' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కొత్త కుట్రలు పన్నుతోందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తెదేపా కొత్త కుట్రలు
వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని.. ఆవేశాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలను రాజా కోరారు. తన రాజకీయ స్వలాభం కోసం ఎంత నీచానికైనా దిగజారే ఔరంగజేబు లాంటి వారు చంద్రబాబు అని విమర్శించారు.
ఇదీ చదవండీ:తొలి దశలో 517 పంచాయతీలు ఏకగ్రీవం.. చిత్తూరులోనే అత్యధికం