ఏలేరు కాలువకు భారీగా వరద నీరు చేరిన కారణంగా.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలోని కాండ్రకోట నుంచి తిమ్మాపురం వెళ్లే మార్గంలో ఉన్న వంతెన కోతకు గురై కుంగింది. మాజీ మంత్రి, నియోజకర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శనివారం వంతెనను పరిశీలించారు. వరద కారణంగా పంట నష్టం ఎంత జరిగిందో రైతులను అడిగి తెలుసుకొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఏలేరు కాలువ ఆధునీకరణకు చర్యలు చేపట్టాలి: చినరాజప్ప - తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప వార్తలు
ఏలేరు కాలువ ఆధునీకరణ ఫేజ్-2 పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. శనివారం పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోటలో ఆయన పర్యటించారు. వర్షానికి పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
తెదేపా ప్రభుత్వం హయాంలో ఏలేరు కాలువ ఆధునీకరణ పేజ్ -1 పనులకు త్వరితగతిన టెండర్లు పిలిచి పూర్తి చేశామన్నారు చినరాజప్ప. ఆ పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించటంతో వైకాపా ప్రభుత్వం జ్యాపం చేస్తోందని మండిపడ్డారు. అలాగే గత ప్రభుత్వం ఏలేరు కాలువపై అనేక చెక్ డ్యాంలకు శంకుస్థాపన చేసిందన్న ఆయన... వాటిని పూర్తి చేయకుండా ప్రస్తుత సర్కార్ పక్కన పెట్టిందని ఆరోపించారు. ఏలేరు కాలువ ఆధునీకరణ ఫేజ్- 2 పనులను ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది వరద నీటి నిర్వహణలో ఏలేరు రిజర్వాయర్ ఇంజినీరింగ్ విభాగం విఫలమైందని చినరాజప్ప అన్నారు. అందుకే పంట నష్టం భారీగా జరిగిందని చెప్పారు.