ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో సహకార రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి - TDP MLA Gorantla Butchaiah Chaudhary

రాష్ట్రంలో సహకార రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. అందుకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్యాపురం కో ఆపరేటీవ్ బ్యాంక్ ఉదాహరణగా నిలుస్తోందని, డ్రైనేజీ వ్యవస్థకు శాస్వత పరిష్కారం చూపించకుండా, పేపరు మిల్లుపై అధికార పక్ష ప్రజా ప్రతినిధులు పెత్తనం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి
TDP MLA Gorantla Butchaiah Chaudhary

By

Published : Dec 14, 2022, 11:34 AM IST

Government Debilitating Co operative Sector In The State: రాష్ట్రంలో సహకార రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. అందుకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్యాపురం కో ఆపరేటీవ్ బ్యాంక్ ఉదాహరణగా నిలుస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 16 బ్రాంచీలు, 11 వందల కోట్ల రూపాయల టర్నోవర్ తో ఉన్న బ్యాంకుకు ప్రత్యేక అధికారి, సెక్రటరీ లేరని చెప్పారు. నెల రోజులుగా బ్యాంకులో లావీదేవీలు ఆగాయని, 9 కోట్ల డిపాజిట్లు వెనక్కిమళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరం నగరంలో మురుగు నీటి వ్యవస్థను బాగు చేసే పని చేయకుండా నిత్యం పేపరు మిల్లు కాలుష్యంపై వైసీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. అమృత్ పథకంలో నిధులు మంజూరు చేయించి డ్రైనేజీ వ్యవస్థకు శాస్వత పరిష్కారం చూపించకుండా, పేపరు మిల్లుపై అధికార పక్ష ప్రజా ప్రతినిధులు పెత్తనం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం వలన దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంకు బెయిల్ మంజూరైందని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని బుచ్చయ్య డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details