నదుల్లో వరదలు తగ్గినా... ప్రజలకు ఇసుక అందుబాటులోకి రావడం లేదని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి రూ.1200 కోట్ల ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న విజయవాడలో ఇసుక కొరతపై చంద్రబాబు చేయనున్న దీక్షకు.. కార్మికులందరూ మద్దతుగా నిలవాలని కోరారు.
"వరదలు తగ్గాయి... ఇసుక ఎక్కడా?" - gorintla fires on cm jagan in rajahmundry
ఇసుక విధానంపై ప్రభుత్వం అవలంబిస్తోన్న విధానాన్ని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తప్పుబట్టారు. వరదలు తగ్గితే ప్రజలకు ఇసుక అందుబాటులోకి తెస్తామన్న జగన్ ప్రభుత్వం...వరదలు తగ్గినా ఇసుక సరఫరా కావటం లేదని విమర్శించారు. ప్రభుత్వం త్వరితగతిన ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి... భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు.
రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి