రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులపైకి నెట్టడం సిగ్గుచేటని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. "కొనుగోలు చేయకుండా, టెండర్లు పిలవకుండా కేంద్రానికి లేఖలు రాస్తే వ్యాక్సిన్ వస్తుందా? కేరళ వంటి రాష్ట్రాలు వ్యాక్సిన్ పంపిణీలో దేశంలోనే ముందంజలో ఉంటే... వివిధ రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. మన ముఖ్యమంత్రి ఇంతవరకూ ఆర్డర్ పెట్టకుండా బడ్జెట్లో రూ.500కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ప్రజల ప్రాణాలంటే చిత్తశుద్ధి లేని జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు" అని ఓ ప్రకటనలో ఘాటు విమర్శలు చేశారు.
'వ్యాక్సినేషన్‌పై వచ్చే వ్యతిరేకతను ప్రైవేటు ఆసుపత్రులపైకి నెట్టడం సిగ్గుచేటు' - Gorantla Butchaiah Chowdary comments on Vaccination
సీఎం జగన్‌పై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి హాట్ కామెంట్స్ చేశారు. వ్యాక్సినేషన్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రైవేట్ ఆసుపత్రులపై నెడుతున్నారని ఆక్షేపించారు. ప్రజల పాణాలంటే లెక్కలేని జగన్‌కు ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Gorantla Butchaiah Chowdary