ETV Bharat / state
'మాది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు.. ప్రజలు ఎన్నుకున్నది'
తమది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదనీ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈసీ ప్రధాని మోదీకి ఏజెంట్లా పనిచేస్తోందని మండిపడ్డారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
By
Published : Apr 21, 2019, 4:02 PM IST
| Updated : Apr 21, 2019, 4:26 PM IST
ఎన్నికలయ్యాక రాష్ట్రంలో 43 రోజులు పాలన ఆగిపోవాలా అని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరంలో అన్నారు. తమ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదనీ... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమన్నారు. జూన్ వరకు పాలించే హక్కు ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రధాని మోదీకి ఏజెంట్లా మారారని ఆరోపించారు. న్యాయవ్యవస్థనూ భ్రష్టుపట్టించారని విమర్శించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘం సభ్యుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఈసారి తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇవీ చదవండి..
Last Updated : Apr 21, 2019, 4:26 PM IST