పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతోనూ వైకాపా రాజకీయాలు చేయడం దారుణమని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక వస్తువుల పైన పాఠశాలకు సంబంధించిన లోగో లేదా పేరు ఉండాలి కానీ వైకాపా రంగు వేసుకుంటే ఎలా అని నిలదీశారు. విద్యా కానుకను పార్టీ కానుకగా చేయకండని హితవు పలికారు. జగనన్న విద్యా కానుక లోగో ఉన్న బెల్టు ఫోటోను గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
'విద్యా కానుకను పార్టీ కానుకగా చేయకండి' - జగనన్న విద్యా కానుకపై వార్తలు
వైకాపా ప్రభుత్వం విద్యా కానుకను పార్టీ కానుకగా చేసిందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. విద్యా కానుకలో ఇచ్చిన వస్తువులపైన పాఠశాలకు సంబంధించిన లోగో వేయకుండా వైకాపా రంగు వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
!['విద్యా కానుకను పార్టీ కానుకగా చేయకండి' gorantla buchaiyya chowdary on jagananna vidya kanuka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9106842-658-9106842-1602214278105.jpg)
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి