పార్టీలో లోటుపాట్లను చంద్రబాబుకు రాతపూర్వకంగా ఇచ్చినట్లు తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఇతర ప్రతిపక్షాలను కూడా కలుపుకోవాలని సూచించినట్లు వెల్లడించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని పేర్కొన్నారు.
Butchaiah Chowdary: 'పార్టీలో లోటుపాట్లను అధినేతకు రాతపూర్వకంగా ఇచ్చా' - వైకాపాపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు
పార్టీలో లోటుపాట్లను చంద్రబాబుకు రాతపూర్వకంగా ఇచ్చినట్లు తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని పేర్కొన్నారు.
వైకాపా ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాల పింఛన్లు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన తప్పుడు ప్రచారం వల్లే.. పోలవరం అంచనాలు రూ.55వేల కోట్లకు కేంద్రం అంగీకరించలేదన్నారు. పోలవరం నిర్వాసితుల ఇళ్లకు 25 రకాల సౌకర్యాలు కల్పిస్తామని.. రెండు సౌకర్యాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రెండేళ్లలో 9వేల కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ ఛార్జీలు ప్రజల నుంచి వసూలు చేశారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసుల విధానం మానకపోతే డీజీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని గోరంట్ల హెచ్చరించారు.
ఇదీ చదవండి: