ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ.. యథావిధిగా సాగుతున్న రైళ్ల రాకపోకలు - ఏపీలో పట్టాలు తప్పిన గూడ్సు

GOODS TRAIN : రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పూర్తైంది. సిబ్బంది శరవేగంతో ట్రాక్‌ మరమ్మతు పనులు పూర్తి చేయడంతో.. యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి.

GOODS TRAIN
GOODS TRAIN

By

Published : Nov 9, 2022, 9:19 AM IST

Updated : Nov 9, 2022, 2:32 PM IST

GOODS TRAIN DERAILED : రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పూర్తైంది. సిబ్బంది శరవేగంతో ట్రాక్‌ మరమ్మతు పనులు పూర్తి చేయడంతో.. యథావిధిగా రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఒకే ట్రాక్‌పై రాకపోకలు కొనసాగాయి.

రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ.. యథావిధిగా సాగుతున్న రైళ్ల రాకపోకలు

అసలేం జరిగిందంటే: రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. కోల్‌కతా-చెన్నై మార్గంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పి.. ఒకవైపు ఒరిగిపోయింది. రైలు ప్రమాదానికి గురైన మార్గంలో మరమ్మతులు కొనసాగుతుండటంతో.. సింగిల్‌ ట్రాక్‌పైనే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఫలితంగా కోల్‌కతా-చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.గూడ్స్​ రైలు పట్టాలు తప్పడంతో... 9 ప్యాసింజర్​ రైళ్లు రద్దు కాగా 2 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ మధ్య రైళ్లు రద్దయ్యాయి. అలాగే గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు.. విజయవాడ-గుంటూరు రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు కాగా.. విజయవాడ-రాజమహేంద్రవరం రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated : Nov 9, 2022, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details