ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎన్​ఆర్​ఐ ప్రభాకర్​రెడ్డిని అరెస్టు చేయాలి' - గొల్లపల్లి సూర్యరావు వార్తలు

వైకాపా ఎన్​ఆర్​ఐ సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రభాకర్​రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని కోరుతూ...తూర్పుగోదావరి జిల్లా రాజోలులో తెదేపా నేత గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. ఎస్సీలను అవమానపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్​ఆర్​ఐ ప్రభాకర్​రెడ్డిని అరెస్టు చేయాలి
ఎన్​ఆర్​ఐ ప్రభాకర్​రెడ్డిని అరెస్టు చేయాలి

By

Published : Oct 15, 2020, 5:05 PM IST

ఎస్సీలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎన్​ఆర్​ఐ సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రభాకర్​రెడ్డిని అరెస్టు చేయాలని కోరుతూ..తెదేపానేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులో దళిత నాయకులతో కలిసి ఆయన నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రభాకర్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details