ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మీ అబ్బాయి స్నేహితుడినంటూ వచ్చి.. 5 కాసుల బంగారం ఎత్తుకెళ్లాడుట ! - మాయమాటలతో నమ్మించి.. 5 కాసుల బంగారం ఎత్తుకెళ్లిన చోరీగాడు

రోజురోజుకు మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్తపోకడలతో అమాయకులను నమ్మించి చోరీలకు పాల్పడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని ఓ ఇంటికి వెళ్లి.. మీ అబ్బాయి, నేను స్నేహితులమన్నాడు. వేలిముద్ర వేస్తే చేయూత పథకంలో నగదు వస్తుందని నమ్మించాడు. మాయమాటలతో ఆమెను సచివాలయం వద్దకు తీసుకెళ్లాడు. ఆమెను అక్కడే ఉంచి తిరిగి ఇంటికి వెళ్లి 5 కాసుల బంగారంతో ఉడాయించాడు.

gold theft case at vanapalli
vమాయమాటలతో నమ్మించి

By

Published : Jun 21, 2021, 2:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారు సాంబశివరావుపేటలో దంగేటి సత్యనారాయణ, సత్యవతి దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమారుడు నాగరాజు.. భార్యతో కలిసి అత్తవారింటికి వెళ్లాడు. ఇంట్లో సత్యవతి ఒక్కరే ఉన్న సమయంలో ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి ఇంటికెళ్లాడు. మీ అబ్బాయి నాగరాజు, నేను స్నేహితులమని సత్యవతిని నమ్మించాడు. మీరు వేలిముద్ర వేస్తే చేయూత పథకంలో నగదు వస్తుందని.. నిన్ను సచివాలయం వద్దకు తీసుకెళ్లమని మీ అబ్బాయి చెప్పాడని నమ్మబలికి ఆమె సచివాలయం వద్దకు తీసుకెళ్లాడు. తాను మళ్లీ వచ్చే వరకు వేలిముద్ర వేయవద్దని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లి 5 కాసుల బంగారు ఆభరణాలు తస్కరించాడు. ఏం తెలియనట్లు తిరిగి సచివాలయం వద్దకు వెళ్లి వేలి ముద్ర వేయాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్లిపోయాడు.

ఇంటికి వెళ్లిన సత్యవతి చోరీ జరిగినట్లు గుర్తించి కంగుతిన్నది. మోసపోయామని తెలుసుకొని కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details