కాకినాడ జగన్నాథపురంలోని ఎస్బీఐ శాఖలో బినామీ వ్యక్తుల పేరుతో నకిలీ బంగారాన్ని కుదువపెట్టి భారీగా రుణాలు పొందిన అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. బ్యాంకులోని ఓ అప్రైజర్ ప్రమేయంతో అక్రమాలు జరిగినట్లు సమాచారం. దాంతో ఉన్నతాధికారుల బృందం అంతర్గత విచారణ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి 15రోజులుగా విధులకు రాకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు తనిఖీల్లో భాగంగా మార్చి మొదటివారంలో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏ స్థాయిలో అక్రమం జరిగిందన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
'కాకినాడలోని జగన్నాథపురం ఎస్బీఐ శాఖలో నకిలీ బంగారంతో రుణాలు' - east godavari latest news
కాకినాడలోని జగన్నాథపురం ఎస్బీఐ శాఖలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కీలక ఉద్యోగి 15 రోజులుగా విధులకు రాకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నకిలీ బంగారంతో రుణాలు