గ్రీన్ వార్మ్స్, స్మార్ట్ విలేజ్ మూమెంట్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను సేకరించి సముద్ర కాలుష్య నివారణకు కృషి చేసి ఇటీవల ఐరాస వెబ్ టీవీలో ప్రసంగించిన తాడి దీపికకు భారత ప్రభుత్వం(జిఓఐ) ట్వీటర్ వేదికగా ప్రశంసలు అందించింది. "కాలుష్యం, సముద్ర జీవులపై దాని ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన కల్పించడంలో దీపిక ఒక చిహ్నంగా మారింది" అని ట్విటర్లో పేర్కొంది.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రశంసపై దీపిక ఆనందం వ్యక్తం చేసింది. గ్రీన్ వార్మ్స్ సంస్థ ప్రతినిధులు అక్షయ్ గుంటేటి, సునీల్‌లు ఆమెకు అభినందనలు తెలియజేశారు.