ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ అమలు చేస్తున్నారని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంతబాబుతో కలిసి ఎంపీ పర్యటించారు. ముందుగా రాజవొమ్మంగిలో రూ.20 కోట్లతో ఏకలవ్య ఆదర్శ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని జడ్డంగిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు బ్యాగులను, పుస్తకాలను, బూట్లు, తదితర వస్తువులను పంపిణీ చేశారు.
'ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ అమలు చేస్తున్నారు' - Goddet Madhavi comments on jagan
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారని ఎంపీ మాధవి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగిలో అరకు ఎంపీ మాధవి పర్యటించారు.
మాధవి