తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి నుంచి రికార్డు స్థాయిలో వరద నీటిని దిగువకు వదలడంతో గౌతమి గోదావరి నది పరివాహక ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం యానాం వరదనీటిలో మునిగాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో వరద ముంపునకు గురైంది. వరద ప్రభావాన్ని యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా పుదుచ్చేరి ప్రభుత్వానికి వివరించారు. స్థానిక ఎమ్మెల్యే, పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, అధికారులతో కలిసి యానాం వరద ప్రాంతాన్ని పరిశీలించారు.
యానాంను ముంచెత్తిన వరద...ముంపు గ్రామాల్లో మంత్రి పర్యటన
వరదతో గోదావరిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో అధికారులు ధవళేశ్వరం బ్యారేజి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వరద నీరు దిగువనున్న గోదావరి పాయల పరివాహక ప్రాంతాలు, యానాంను ముంచెత్తింది. యానాంలో ముంపునకు గురైన ప్రాంతాలను పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు పరిశీలించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
యానాంను ముంచెత్తిన వరద...ముంపు గ్రామాల్లో మంత్రి పర్యటన
ప్రజలకు ధైర్యం చెప్పిన మల్లాడి కృష్ణారావు సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అల్పాహారం, భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రాజీవ్ బీచ్లో సుమారు వెయ్యి గృహాలు వరద ముంపులోనే ఉన్నాయి. నదీ ప్రవాహానికి మత్స్యకారుల బోట్లు, వలలు కొట్టుకుపోయాయి.
ఇదీ చదవండి :ముంపులో సర్ ఆర్ధర్ కాటన్ అక్విడెక్ట్