GRMB meeting in Hyderabad today: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఇవాళ హైదరాబాద్‌లో సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ ఎంకే సిన్హా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు, ఇంజనీర్లు హజరుకానున్నారు. బోర్డు నిర్వహణ వ్యయం, గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన సీడ్ మనీ, అదనపు పోస్టులు, ప్రత్యేక వసతి తదితర అంశాలపై చర్చ జరగనుంది.
నేడు హైదరాబాద్‌లో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం
GRMB meeting in Hyderabad today: తెలంగాణకు చెందిన గూడెం, మొడికుంటవాగు ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నీటిలభ్యతపై అధ్యయనం అంశాలు అజెండాగా ఇవాళ హైదరాబాద్‌లో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల సరిహద్దు పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు, పెద్దవాగు ప్రాజెక్టు ఆధునీకరణ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చ జరగనుంది.
తెలంగాణకు చెందిన గూడెం, మొడికుంటవాగు ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు జీఆర్ఎంబీ సమావేశం ముందుకు రానున్నాయి. వాటిపై చర్చించి కేంద్ర జలసంఘానికి నివేదించాల్సి ఉంటుంది. నీటి ప్రవాహ లెక్కింపు కోసం గోదావరి బేసిన్లోనూ టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని..భావిస్తున్నారు. పెద్దవాగు ప్రాజెక్టును గోదావరి బోర్డుకు అప్పగించేందుకు ఇరురాష్ట్రాలు అంగీకరించిన నేపథ్యంలో ప్రాజెక్ట్ ఆధునికీకరణ పనులపై చర్చించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి బేసిన్‌లో ఉండే నీటి లభ్యతపై ఒక ప్రతిష్టాత్మక సంస్థతో అధ్యయనం చేయించే అంశంపైనా చర్చ జరగనుంది. గత ఏప్రిల్‌లో సమావేశమైన గోదావరి బోర్డు ఎనిమిది నెలల విరామం తర్వాత మరోమారు భేటీ అవుతోంది.
ఇవీ చదవండి: