దేవీపట్నం వద్ద గోదావరి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తొయ్యేరు, దేవీపట్నం, పూడిపల్లి, దండంగి, ఎ.వీరవరం, పోచమ్మగండి, గానుగులగొందు, పాతూరు గ్రామాల్లో జలదిగ్భంధం అయ్యాయి.1500 ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద పెరగటంతో రెండ్రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేవీపట్నం గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు ముంచ్చెత్తింది. కచ్చులూరు నుంచి కొండమెుదలు వరకు గోదావరి నదీ ఒడ్డున ఆనుకుని ఉన్న 20 గ్రామాల గిరిజనులు వరదతో భయాందోళనలో ఉన్నారు.
దేవీపట్నం వద్ద ఉద్ధృతంగా గోదావరి వరద ప్రవాహం - తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వార్తలు
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహించటంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నది రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. దేవీపట్నం, పోచమ్మగండి,గానుగులగొందు, పాతూరు గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయి. గోదావరి నదీ ఒడ్డున ఆనుకుని ఉన్న 20 గ్రామాల గిరిజనులు వరదతో భయాందోళనలో ఉన్నారు.

దేవీపట్నం వద్ద ఉద్ధృతంగా గోదావరి వరద ప్రవాహం