ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి.. ఆందోళనలో ముంపు గ్రామాల ప్రజలు - దేవిపట్నం వద్ద ఉధ్ధృతంగా గోదావరి నది

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహించటంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీరికి పునరావాస కాలనీలు ఏర్పాటుచేసినా.. అవి పూర్తిగా సిద్ధం కాకపోవటంతో అక్కడకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు.

Godavari river excerpt in devipatnam east godavari district
దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి

By

Published : Aug 12, 2020, 10:07 AM IST

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నది రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో ముంపునకు గురయ్యే దేవీపట్నం, పోశమ్మగండి, వీరవరం, పూడిపల్లి గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

వీరికి పునరావాస కాలనీలు ఏర్పాటు చేసినప్పటికీ గృహాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. దీంతో గ్రామాలలోనే బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అధికారులు గ్రామాల్లో సభలు ఏర్పాటుచేసి ఖాళీ చేయాలని ఆదేశిస్తున్నారు. అయితే ఇళ్లు పూర్తిగా సిద్ధం అయితేనే తాము వెళ్తామని ఆయా గ్రామస్థులు అంటున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details