ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరి నదికి అక్రమంగా అడ్డుకట్ట - గోదావరి నదికి అక్రమంగా అడ్డుకట్ట

గోదావరి నదీ ప్రవాహానికి ఎలాంటి అడ్డుకట్ట వేయకూడదు. అలా చేస్తే చట్టరీత్యా నేరం. అలాంటిది తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది పాయకు వేగంగా అడ్డుకట్ట వేస్తున్నారు. వీటికి అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు.

godavari rever
godavari rever

By

Published : May 27, 2020, 8:42 AM IST

తూర్పు గోదావరి జిల్లా.. పి గన్నవరం నియోజకవర్గంలోని మానేపల్లి, పల్లెపాలెం దగ్గర గోదావరి నది పాయకు అడ్డుగా గట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పని దాదాపుగా పూర్తి కావచ్చింది. అవతల లంక భూముల నుంచి మట్టిని లారీలలో ఇవతలకు తరలించేందుకు .. నది పాయకు అడ్డుగా గట్టు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ విషయంపై పి గన్నవరం ఎమ్మార్వో మృత్యుంజయరావు , హెడ్ వర్క్స్ అధికారులను వివరణ కోరగా.. అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదికి ఇలా అడ్డుకట్ట వేయడంపై.. ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details