తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నది పాయల వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. నిర్వహణ లేక అధ్వాన్నంగా తయారయ్యాయి. కార్తీక స్నానాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల వద్ద సౌకర్యాలు కల్పించాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.
కోనసీమలో అధ్వాన్నంగా గోదావరి పుష్కరఘాట్లు - konaseema news today
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని పుష్కర ఘాట్ల వద్ద అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. కార్తీక మాసం సందర్భంగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
కోనసీమలో అధ్వాన్నంగా గోదావరి పుష్కరఘాట్లు