ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద తగ్గినా...లంక గ్రామాల ప్రజలకు తప్పని కష్టాలు - కోనసీమ వార్తలు

గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టినా....చాలా వరకు కోనసీమలోని లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

godavari-floods-in-konaseema
ముంపులోనే లంక గ్రామాలు

By

Published : Aug 24, 2020, 3:15 PM IST



గోదావరి వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14 లక్షల 40 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడిచిపెట్టారు. నిన్న ఇదే సమయానికి 18 లక్షల 68 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. నిన్నటితో పోలిస్తే ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద తగ్గింది. అయినా కోనసీమలో పలు లంక గ్రామాలను వరద వీడలేదు.

పల్లపు లంకలో వరద నీరు... అక్కడ నివాస గృహాలను చుట్టుముట్టింది. ఎత్తుగా ఉన్న లంక గ్రామాల రహదారుల నుంచి వరద నీరు క్రమేపీ తగ్గుతోంది. దీంతో కొందరు రాకపోకలు సాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details