తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 20 లంక గ్రామాల్లో ప్రజలు గత వారం రోజులుగా అనుభవిస్తున్న కష్టాలు వర్ణనాతీతం. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గట్లపై నుంచి పరిస్థితి చూసి పోవడం తప్ప.. పీకల్లోతు నీట మునిగి ఉన్న తమను గట్టున పడేసే మార్గం చూపడం లేదని అంటున్నారు. కనీసం మంచినీటి ప్యాకెట్లు కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద ముంపుతో లంక ప్రజల అవస్థలు
వండుకుందామంటే సరకుల్లేవు.. తాగుదామంటే నీళ్ళు లేవు.. తలదాచుకుందామంటే గూడు లేదు... ఇలానే మరో 4 రోజులుంటే బ్రతికుంటామనే ఆశ లేదు.. ఇదీ గోదావరి వరద ముంపు గ్రామాల్లోని ప్రజల ఆవేదన. వరదలు వారికి సాధారణమే అయినా ఈ స్ధాయిలో తగ్గుతూ పెరుగుతూ ఉండటం, ఇళ్ళ నుంచి అడుగు బయటపెట్టే పరిస్థితి లేకపోవటంతో పిల్లా పాపలతో..ముసలివాళ్ళతో చిగురుటాకులా వణికిపోతున్నారు..
వరద ముంపుతో లంక ప్రజల అవస్థలు