తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ అంకంపాలెం యేటిగట్టు వద్ద ఉన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ లాకులు ప్రమాదకరంగా మారాయి. పంట కాలువలో వరద నీరు అధికంగా చేరుతోంది. వరదల సమయంలో గ్రామాల్లోకి నీరు రాకుండా.. ఆ నీటిని గోదావరిలోకి వెళ్లే విధంగా బ్రిటిష్ కాలంలో యేటిగట్లపై అవుట్ ఫాల్ స్లూయిజ్ లు ఏర్పాటు చేశారు.
ఈ లాకులకు మూడు గేట్లు ఉండగా ఒకటి వంగిపోయింది. వరద నీరు బయటకు వచ్చి చుట్టు పక్కల పొలాలను ముంచెత్తింది. పరిస్థితిని గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వరదనీరు బయటకు రాకుండా ఇసుక మూటలు అడ్డుగావేశారు. గోదావరి వరద పోటుతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.