ఇటీవల వచ్చిన గోదావరి వరదల కారణంగా.. తూర్పుగోదావరి జిల్లాలో నదితీరం వెంబడి సుమారు 30 కిలోమీటర్ల మేర భూములు గోదావరి పాలయ్యాయి. ఈ వరదలకు తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన నది కోత నష్టంపై వివరాలు సేకరించామని... గోదావరి వరద ప్రత్యేక అధికారి నల్లం కృష్ణారావు తెలిపారు. అఖండ గోదావరి మొదలుకొని కోనసీమలోని వశిష్ట, వైనతేయ, గౌతమి గోదావరి నది పాయలు ఆనుకుని సుమారు 30 కిలోమీటర్ల మేర లంక భూములు నదీ కోత బారిన పడ్డాయని వెల్లడించారు. దీనికి రక్షణ చర్యలు చేపట్టాలంటే రూ.450 కోట్ల నిధులు అవసరం ఉంటుందని ఆయన వెల్లడించారు.
గోదావరి వరదలు.. 30 కిలోమీటర్ల మేర నది కోత..!
ఇటీవల వచ్చిన వరద ఉద్ధృతి కారణంగా సుమారు 30 కిలోమీటర్ల మేర నదీ తీరం కోతకు గురైందని... గోదావరి వరద ప్రత్యేక అధికారి నల్లం కృష్ణారావు తెలిపారు. దీని రక్షణ చర్యలకు సుమారు రూ.450 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.
30 కిలోమీటర్ల మేర నది కోత