ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే - ఎర్రచందనం పట్టివేత ముగ్గురి అరెస్టు

గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. ఊరూ వాడా ముంచేసింది. తీరమంతా ముంపులోనే కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం జలదిగ్భందంలోనే మగ్గిపోతోంది. కోనసీమ లంకగ్రామాల్లోకి వరదనీరు చేరుకుంది. పంట పొలాలన్నీ ముంపు బారినపడ్డాయి

తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే!

By

Published : Aug 5, 2019, 5:22 AM IST


తీరాన్ని గోదావరి వరద అతలాకుతలం చేస్తోంది. లోతట్టు ప్రాంతాలనంతా ముంచేసింది. ఈ సీజన్​లోనే గరిష్ట వరద రాజమహేంద్రవరానికి తాకింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి గరిష్ట వరద 13.50 లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. కాటన్‌ ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దేవీపట్నం మండలం ఐదొవ రోజు ముంపులోనే మగ్గిపోతోంది. కొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చినా మిగతావారు వరదనీటిలోనే మగ్గిపోతున్నారు.

తీరమంతా ముంపులోనే...లంక గ్రామాలన్నీ నీటిలోనే!
ఆ గ్రామాలన్నీ నీటిలోనే....దేవీపట్నం మండల కేంద్రం దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి, వీరవరం, రమణయ్యపేట, అగ్రహారం, గొందూరు తదితర గ్రామాలన్నీ పూర్తిగా నీటిలోనే చిక్కుకుపోయాయి. గండిపోశమ్మ ఆలయం ఐదోవ రోజు వరదనీటిలోనే మునిగి ఉంది. ప్రజలు అంధకారంలోనే మగ్గిపోతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆహారం, తాగునీరు అందడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోనసీమపై తీవ్ర ప్రభావం.. ధవళశ్వరం వద్ద వరద రెండో ప్రమాద హెచ్చరికను చేరడంతో కోనసీమపై తీవ్ర ప్రభావం చూపింది. ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అల్లవరం, మామిడికుదురు, పి.గన్నవరం మండలాల్లోని లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లెపాలెంలో వరదనీరు చేరడంతో పరిస్థితిని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పరిశీలించారు. తీరం వెంబడి ఉద్యానవనం, పూలతోటలు పూర్తిగా నీట మునిగాయి. అరటి, బొప్పాయి తోటల్లోకి గోదావరి వరదనీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరదలు అపారనష్టం తెచ్చిపెట్టాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు ధవళేశ్వరం వద్ద వరద కాస్త తగ్గే అవకాశం ఉన్నా... ఎగువ నుంచి మళ్లీ వరద వచ్చే అవకాశం ఉండటంతో జలవనరులశాఖ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details