తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన ఉన్న మండలాలతో పాటు బ్యారేజి దిగువన ఉన్న కోనసీమలోని 15 మండలాలు, తూర్పు డెల్టాకు చెందినటువంటి మండలాలు గోదావరి వరదల ప్రభావానికి గురవుతుంటాయి. ప్రధానంగా వరదల సమయంలో మర బోట్లను ఆశ్రయించి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు కరోనా సమస్య ఉద్ధృతంగా ఉన్న పరిస్థితుల్లో.. వరదల ముప్పును ఎదుర్కొనేందుకు అధికారులు ముందుగానే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది.
ఈ విషయంపై అమలాపురం ఆర్టీవో బి హెచ్ భవాని శంకర్ స్పందించారు. మర పడవల్లో ప్రయాణాలు చేసే వారు.. భౌతిక దూరం పాటించాన్నారు. ఈసారి మర పడవలు ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. శానిటైజర్లు, వైరస్ క్రిమిసంహారక ద్రావణం ఇలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు.