తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండల పరిధిలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో భారీగా పంటపొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. నందిగామ, గన్నవరం, నెల్లిపాక, గౌరేదేవిపేట, సీతాపురం, తోటపల్లి గ్రామాల్లో పంటపొలాలు భారీగా నీట మునిగాయి. మిరప, పత్తి, వరి వందల ఎకరాల్లో ముంపుకు గురయ్యాయి. సాగు ప్రారంభం నుంచి ఇదే పరిస్థితులు ఎదుర్కొంటున్నామని..అన్నారు. మొక్కలు పీకాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎటపాక మండలానికి వరద తాకిడి ఇది నాల్గవ సారి. మొదటిసారి 38 అడుగులు వచ్చిన తగ్గుముఖం పట్టింది. రెండోసారి 43 అడుగులకు మొదటి ప్రమాద హెచ్చరికకు చేరి తగ్గింది. మూడోసారి 37 అడుగులకు చేరి తగ్గింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి వరద ప్రవహిస్తోంది.
గోదావరి ఉగ్రరూపంతో.. అంతకంతకూ వరద పెరుగుతోంది...
గోదావరి ఉగ్రరూపంతో ప్రమాదకరంగా మారిపోయింది. వరద ఉద్ధృతి పెరగడంతో పంటపొలాలు నీట మునిగాయి. ఉగ్రరూపంతో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఏటపాక మండలం మళ్లీ పూర్తి జలదిగ్భందంలో చిక్కుకుపోయింది.
గోదావరి ఉగ్రరూపంతో.. అంతకంతకూ వరద పెరుగుతోంది...