ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటెక్కితే చాలు.. భౌతిక దూరం దేవుడెరుగు! - corona vs godavari floods

తూర్పు గోదావరి జిల్లా కోనసీమను వరద ముంచెత్తుతోంది. 50 లంక గ్రామల ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పటికే 30 గ్రామలు వరద బారిన పడ్డాయి. కరోనా కాలంలో ఇలాంటి వరదలు రావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరపడవల్లో భౌతిక దూరం పాటించే వీలు లేకుండానే రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు.

godavari flood victims transport  through boats not maintains social distance
godavari flood victims transport through boats not maintains social distance

By

Published : Aug 16, 2020, 3:58 PM IST

పెరుగుతున్న వరద తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లంక గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ఊహించని రీతిలో వరద ఉప్పొంగుతోంది. కోనసీమలోని సుమారు 50 లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇప్పటికే సుమారు 30 గ్రామాల ప్రజలు వరద ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

బూరుగు లంక, జీ. పెదపూడి లంక, అరిగెల వారి పేట, అద్దంకి వారి లంక, వీరవల్లిపాలెం అయినవిల్లి లంక, అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్నం లంక సలాది వారి పాలెం, కమినీ పెదలంక అయోధ్య లంక, పుచ్చ లంక, కనకాయలంక ఇలా వివిధ గ్రామాల ప్రజలు మర పడవలు, నాటు పడవలు ఆశ్రయించి రాకపోకలు సాగిస్తున్నారు.

ఓవైపు కరోనా ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పడవలో ప్రయాణం భౌతిక దూరం పాటించేందుకు వీలులేకుండా పోయింది. కరోనా కారణంగా పడవులను సైతం పెంచాల్సిన అవసరం ఉంది. లైఫ్ జాకెట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని స్థానికులు అంటున్నారు. వరద ఇంకా పెరుగుతున్న కారణంగా అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చూడండి:

దేవీపట్నం వద్ద ఉద్ధృతంగా గోదావరి వరద ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details