ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరుగుతున్న గోదావరి..వరద నీటిలో రహదారులు - east godavari

గోదావరిలో వరద మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 8.5 అడుగుల నీటిమట్టం నమోదైంది.

గోదావరి

By

Published : Sep 13, 2019, 1:10 PM IST

Updated : Sep 13, 2019, 1:22 PM IST

పెరుగుతున్న గోదావరి వరద

ఇన్ని రోజులు వరదతో కంటిమీద కునుకులేకుండా చేసిన గోదావరి... మళ్లీ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద 8.5 అడుగుల నీటిమట్టం నమోదైంది. డెల్టా కాల్వలకు 13 వేల 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 6లక్షల 24 వేల క్యూసెక్కుల వరదను వదులుతున్నారు. కోనసీమలోని కనకాయలంక కాజ్‌వే మళ్లీ నీట మునిగింది. దేవీపట్నం మండలంలో రహదారులన్నీ ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. తొయ్యేరు వద్ద దేవీపట్నం వెళ్లే ఆర్​అండ్​బీ రహదారి మూసుకుపోయింది. మరికొన్ని రోజులు ఇదే ప్రవాహం ఉండొచ్చని.. సుమారు 5, 6 లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అంచనా వేస్తున్నారు.మరోసారి పెరుగుతున్న నీటిమట్టంతో లంకవాసులు ఆందోళన చెందుతున్నారు.

Last Updated : Sep 13, 2019, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details