DHAVALESWARAM: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 23.3 లక్షల క్యూసెక్కులుగా ఉంది. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలపై వరద ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. మరో 241 గ్రామల్లోకి వరద నీరు చేరినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 97 వేల 205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 84 వేల 734మందిని 191 పునరావాస కేంద్రాలకు పంపినట్లు తెలిపారు. 256 మెడికల్ క్యాంప్స్ పెట్టినట్లు చెప్పారు. సహాయ చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నట్లు వివరించారు. పూర్తిగా వరద తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద ప్రాంతాల్లో 256 వైద్యశిబిరాలు, 1,25,015 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ధవళేశ్వరం వద్ద నిలకడగా గోదావరి.. కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక - latest news in ap
DHAVALESWARAM: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉంది. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వరద పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు 97 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
DHAVALESWARAM