తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద అధికారులు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అనకట్ట వద్ద గంటగంటకు ప్రవాహం పెరుగుతోంది. బ్యారెజ్ వద్ద నీటిమట్టం 13.9 అడుగులకు చేరింది. అధికారులకు డెల్టా కాల్వలకు 7వేల 300 క్యూసెక్కులు విడుదల చేశారు. ధవళేశ్వరం గేట్లు ఎత్తి సముద్రంలోకి 13 లక్షల 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద గోదారమ్మ నీటిమట్టం 45.5 అడుగులకు చేరింది.
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ప్రవాహ స్థాయి పెరుగుతోంది. అధికారులు ధవళేశ్వరం వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీచేసింది.
ధవళేశ్వరం