ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జలదిగ్బంధంలో దేవీపట్నం

గోదారమ్మ వరద ప్రవాహం ఐదోరోజు కొనసాగుతోంది. వరద నీటితో దేవీపట్నం మండలం నీటమునిగింది.

గోదావరి

By

Published : Aug 4, 2019, 10:13 AM IST

Updated : Aug 4, 2019, 11:35 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ప్రవాహం ఉద్ధృతమవుతోంది. వరద నీటితో దేవీపట్నం మండలం నీటమునిగింది. మండలం పరిధిలోని సుమారు 32 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఐదురోజులుగా మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటికోసం స్థానికులు వరద బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. సహాయక చర్యలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. వరదలతో విషసర్పాలు ఇళ్లలోకి వస్తుండటంతో మన్యం వాసులు భయాందోళలనలకు గురవుతున్నారు. వరద నీటి ప్రవాహంతో గండి పోచమ్మ ఆలయం మునిపోయింది. సుమారు 600 ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదలో నాటుపడవలపైనే అధికారులు ప్రయాణం సాగిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు.

జలదిగ్బంధంలో దేవిపట్నం మండలం
Last Updated : Aug 4, 2019, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details