తూర్పుగోదావరి జిల్లాలో తూర్పు, మధ్య గోదావరి డెల్టాల్లో రబీలో లక్షా 64వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంట సాగవుతోంది. తూర్పు డెల్టాలో 40వేల హెక్టార్లలో పైగా ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. మరో 60వేలకు పైగా హెక్టార్లు కోతకు సిద్దంగా ఉన్నాయి. శివారు పొలాలకు సాగునీరందడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. రామచంద్రాపురం, అమలాపురం, కాకినాడ డివిజన్ పరిధిలోని శివారు మండలాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొందని రైతులు చెబుతున్నారు. ఈనెలాఖరు వరకు సాగునీరందిస్తే పంటలు పండే అవకాశం ఉందని, లేదంటే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాళ్లరేవు ప్రాంతంలో సాగునీరు పూర్తిస్థాయిలో అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారు. తాజాగా పంట గింజ గట్టిపడుతున్న దశలో నీరు అందక రైతులు తీవ్ర ఆవేదనలో చెందుతున్నారు. వంతులవారీ విధానంలో కూడా నీరందంటం లేదంటున్నారు.
ఏప్రిల్ 10లోపు పూర్తి చేయండి: జలవనరులశాఖ