'అందరి ఆచూకీ లభించే వరకూ గాలింపు' - అందరి ఆచూకీ లభించేంతవరకూ గాలింపు
పడవ ప్రమాదం బాధిత కుటుంబ సభ్యులతో తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ సమావేశం అయ్యారు. అందరి ఆచూకీ లభించే వరకూ గాలింపు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
godavari-boat-accident
బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబసభ్యులతో తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ మహేశ్ కుమార్ సమావేశమయ్యారు. అందరి ఆచూకీ లభించే వరకూ గాలింపు కొనసాగిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాలు దొరకకపోతే... జాబితాలో ఉన్న పేర్ల ప్రకారం మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.