ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇవాళ 18 మృతదేహాలు లభ్యం... మరో 21 మంది కోసం గాలింపు - ఇవాళ 11 మృతదేహాలు లభ్యం

బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గోదావరిలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అగ్నిమాపకదళం, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈరోజు ఇప్పటివరకు 18 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతదేహాలు ఎవరివన్న దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మొత్తం 73 మందిలో 26 మంది సురక్షితం, 26 మృతదేహాలు లభ్యం, మరో 21 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

boat

By

Published : Sep 17, 2019, 10:31 AM IST

Updated : Sep 17, 2019, 2:59 PM IST

godavari-boat-accident-in-ap
ఇవాళ 18 మృతదేహాలు లభ్యం-315 అడుగుల లోతులో బోటు
ఇవాళ 18 మృతదేహాలు లభ్యం... మరో 21 మంది కోసం గాలింపు

బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇవాళ ఇప్పటివరకు18 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద12,ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2, పోలవరం మండలంలో2, తాళ్లపూడిలో ఒక మృతదేహం లభ్యమయ్యాయి. ఆదివారం8 మృతదేహాలను సహాయసిబ్బంది గుర్తించారు. బోటు ప్రమాదంలో మొత్తం ఇవాళ్టికి26 మృతదేహాలు గుర్తించారు. మొత్తం73మందిలో26మంది సురక్షితం, 26 మృతదేహాలు లభ్యం, మరో 21 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పలువురి ఆచూకీ లభించలేదు. ప్రస్తుతానికి మొత్తం 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు ఒక్కొక్కటిగా వివిధ ప్రాంతాలకు కొట్టుకువస్తున్నాయి. 14 మంది మృతదేహాలు నీళ్ల పైకి తేలగా, మరో ఇద్దరి మృతదేహాలను సిబ్బంది గుర్తించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు ఇద్దరి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ వద్ద మరొక మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి జేబులో ఉన్న గుర్తింపు కార్డును పరిశీలించిన పోలీసులు..... మృతుడు హైదరాబాద్‌ మాదాపూర్‌ వాసి ఇ.సాయికుమార్‌గా గుర్తించారు.

పోలవరం ఇసుక రేవు వద్ద, కచ్చులూరు వద్ద, ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద ఒక్కో మృతదేహాన్ని గుర్తించారు. తాళ్లపూడి వద్ద ఒకటి,ధవళేశ్వరం వద్ద మరొక మృతదేహం లభ్యమైంది.విజ్జేస్వరం లాకుల వద్ద17వ నెంబర్ గేట్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది.....బోటు ప్రమాద మృతుడిగా అనుమానిస్తున్నారు.మృతుల వివరాలు కనుగొనే పనిలో ఉన్నారు.

315 అడుగుల లోతులో బోటు మునిగినట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైనవారి కోసం విస్తృతంగా గాలింపు జరుగుతోంది. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు, వరద ఉద్ధృతి ఉండడంతో... గాలింపు చర్యలకు ప్రతికూలంగా మారాయి.సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడింది. పోలవరం వద్ద దొరికిన మృతదేహం నరసాపురానికి చెందిన బి.ఎస్‌.ఫణికుమార్‌గా గుర్తించారు.

Last Updated : Sep 17, 2019, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details