ఉభయగోదావరి జిల్లాల వరదాయని కాటన్ బ్యారేజి పరిసర ప్రాంతాల్లో....సైకత సిరులు దర్శనం ఇస్తున్నాయి.గోదావరిలో వివిధ ప్రాంతాల్లో అపార ఇసుక మేటలు ఉన్నాయి. 3టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న బ్యారేజీ....ఇసుక నిక్షేపాలకు నిలయంగా మారింది.ఈ ప్రాంతాల్లో డ్రెడ్జింగ్ నిర్వహించి చాలా సంవత్సరాలు కావడం వల్ల...ఇసుక పేరుకుపోయింది.గోదావరిలో ఎక్కడెక్కడ ఎంత పరిమాణంలో నిల్వలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.ఈ మేరకు జలవనరులశాఖ కసరత్తు చేస్తోంది.ఇసుక కొరతను తీర్చేందుకు బ్యారేజీ ఎగువున ఈ నెల14నుంచి తవ్వకాలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు అనుమతించినా...టెండర్లు పూర్తికాక ప్రక్రియ ప్రారంభం కాలేదు.
గోదావరి నది ప్రవహించే ప్రాంతాల్లో రాజమహేంద్రవరం పరిసరాల్లో దొరికే ఇసుకను నాణ్యమైనదిగా భావిస్తారు.గండ్ర ఇసుక కావడం వల్ల భవన నిర్మాణదారులు కొనుగోలుకు ఆసక్తి చూపుతారు.చాలా కాలం నుంచి గోదావరిలో అపారమైన ఇసుక నిల్వలు పేరుకుపోయాయని...బయటకు తీయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.