ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికలపై అరాచకాలను ఆపాలంటూ.. సైకత శిల్పాన్ని తీర్చిదిద్దిన బాలికలు - Sohita Dhanyatha

Girls created sculpture: జనవరి 24 జాతీయ బాలిక సంరక్షణ దినోత్సవం పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇద్దపు బాలికలు రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో బాలికల మీద జరిగే అరాచకాలను ఎత్తిచూపుతూ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. శిల్పాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాఠశాలకు వస్తున్నారు.

ఆకట్టుకుంటున్న సైకత శిల్పాం
ఆకట్టుకుంటున్న సైకత శిల్పాం

By

Published : Jan 23, 2023, 6:05 PM IST

Updated : Jan 23, 2023, 8:21 PM IST

Girls created sculpture: ప్రస్తుత సమాజంలో రోజు రోజుకూ ఆడపిల్లల మీద అరాచకాలు పెరుగుపోతున్నాయి. పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దయ్యేదాకా రోజూ ఏదో చోట ఆడపిల్లల మీద అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మనం వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నా.. ఏదో ఓక దారుణం జరుగుతూనే ఉంది. అలాంటి దారుణాాలను ఎత్తిచూపుతూ ఇద్దపు బాలికలు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.

రేపు 'జాతీయ బాలిక సంరక్షణ దినోత్సవం' ను పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్ధినులు దేవిన సోహిత, ధన్యతలు రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో బాలిక గర్భంలో ఉండగానే జరిగే అరాచకాలను ఎత్తిచూపుతూ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఆడపిల్లగా పుట్టడమే పాపమా అని ప్రశ్నిస్తూ.. అత్యాచారాలు, అబార్షన్లు, లింగ వివక్ష , బాల్యవివాహాలు నుంచి గర్భంలో శిశువును రెండు చేతులతో ఒడిసి పట్టుకొని కాపాడుతున్నట్టుగా శిల్పాన్ని రూపొందించారు. 5 యూనిట్ల ఇసుక ఉపయోగించిన చేసిన శిల్పాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాఠశాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా సోహిత ధన్యతలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.

ఆకట్టుకుంటున్న సైకత శిల్పాం

ఇవీ చదవండి:

Last Updated : Jan 23, 2023, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details